నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఆటో కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా శుక్రవారం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ రోజుకు 30 రూపాయలు చొప్పున ఆటో కార్మికుల వద్ద వసూలు చేయలేదని, ఒక్క నగరిలో మాత్రం వసూలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు.