నగరి: చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఎస్పీ

55చూసినవారు
చట్టాలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం కార్వేటినగరం సర్కిల్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఎటువంటి నేరాలు పాల్పడకుండా ఉంటే రౌడీ షీట్ నుంచి పేర్లు తొలగిస్తామన్నారు. ఇది మారడానికి ఒక మంచి అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్