నగరి నియోజకవర్గం,కీలపట్టు కొండమీద వున్న అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజలు నిర్వహించారు.మూలవిరాట్టు విగ్రహానికి పంచామృతములతో అభిషేకం చేశారు.స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.క్రిష్ణమూర్తి గురూజీ మహిళా బృందం వారిచే సుందరకాండ పారాయణ చేశారు.అనంతరం సురేష్ వచ్చిన భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు.