వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా శనివారం టీడీపీ, జనసేన నేతలపై మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? ప్రజల సమస్యలపై ఎంతవరకు పోరాడారు? నేను ఏం చేశానో చెప్పగలను, అందుకు వారు సిద్ధమా? నేను జబర్దస్త్ చేస్తే తప్పా? మరి వాళ్లు షూటింగులు చేస్తే ప్రజల కోసమా? అంటూ ఆమె ప్రశ్నించారు.