నగరి: రోజా వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కౌంటర్

75చూసినవారు
నగరి: రోజా వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కౌంటర్
సీఎం చంద్రబాబుకు మద్దతిస్తున్నారన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. తన రక్త సంబంధమే తనపై విష ప్రచారం చేసిందన్నారు. విజయమ్మకు నేను అక్రమ సంతానమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న కష్టాల్లో ఉన్నాడని 3,200 కి.మీ పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. రాష్ట్ర సమస్యలపై ప్రజా పోరాటాలకే తన మద్దతు ఉంటుందని షర్మిల అన్నారు.

సంబంధిత పోస్ట్