నగరి నియోజకవర్గ వైసీపీ సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి రోజా కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోజా నగిరిలో మాట్లాడుతూ నగరి వైసీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశామన్నారు.