రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా నగిరి నియోజకవర్గం, వడమాల పేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వేషన్లు తీసుకువచ్చి దళితులకు ఆయన ఎన్నలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.