మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కార్వేటి నగరానికి చెందిన జిల్లా పార్లమెంట్ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సందాని శనివారం నగరి డి. ఎస్. పి మొహమ్మద్ అజీజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏ ఏ సందర్భాలలో దాడులు జరిగాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.