నగిరి: మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి

67చూసినవారు
నగిరి: మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
తిరుత్తని తాలూకా మద్దూరం గ్రామం నందు మహిషాసుర మర్దిని అమ్మవారి 25వ వార్షికోత్సవ వేడుకలలో సోమవారం మాజీ మంత్రి రోజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు, నిర్వాహకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం 1008 బిందెలతో చేసిన పాలాభిషేకం, ఊరేగింపు తదితర విశేష పూజలు రోజా పాల్గొన్నారు. అనంతరం ఆమెకు ఆలయ ఆస్థాన మండపంలో అమ్మవారి శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను కమిటీ సభ్యులు అందించారు.

సంబంధిత పోస్ట్