ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరిలో మాత్రమే ఆటో కార్మికుల వద్ద రోజుకు రూ. 30 గేటు పేరుతో వసూలు చేయడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండయ్య తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం చిత్తూరులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ ను కలిసి ఏఐటీయూసీ నాయకులు వినతి పత్రం అందించారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో ఆటో కార్మికులు సతమతమవుతుంటే గేటు వసూలు చేయడం దారుణం అన్నారు.