నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలం లోని నారాయణ వనంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టిటిడి ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.