హోంమంత్రి వంగలపూడి అనితను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా విజయవాడలో హోంమంత్రిని కలిసి నగరి నియోజకవర్గంలోని సమస్యలు వివరించారు. సవివరంగా ఆ సమస్యలను విన్న హోంమంత్రి సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.