నగిరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ మిట్ట పల్లూరు లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు పండితులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కళ్యాణం నిర్వహించిన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకి పండితులు అందించారు.