తిరుపతి జిల్లాలో బుధవారం జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయాల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అంతేకాకుండా సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు దేవాలయాలకు ఉన్నటువంటి చరిత్ర ఆధారాల గురించి సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నిపుణులు తదితరులు పాల్గొన్నారు.