నగిరి నియోజకవర్గ ప్రజల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అంజేరమ్మను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి అమ్మవారి పుష్పమాలను అందించి ఆశీర్వచనాలు చేశారు. మహా మంగళ హారతి అనంతరం నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు.