చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ వడమాలపేట మండలానికి చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.