నగరి రూరల్ మండలం లోని వి ఎన్ ఆర్ పేటలో తమకున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నుకోరగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సుమారు రూ. 3 లక్షలు ఖర్చు పెట్టి బోర్ వేసి, శనివారం బోరుకు మోటార్ ఏర్పాటు చేశారు. దీనితో స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు.