నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ గురువారం పుత్తూరు మండలంలో పర్యటిస్తారని బుధవారం ఆయన పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయం 10 గంటలకు పుత్తూరు బైపాస్ పున్నమి సర్కిల్ దగ్గర కార్తీక్ ఫంక్షన్ హాల్లో పుత్తూరు పట్టణం టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని టీడీపీ ముఖ్య నాయకులు తెలిపారు.