చిత్తూరు జిల్లా, నగరి రూరల్ మండలం, మూలనత్తం జాతర లో బుధవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర కు విచ్చేసిన ఎమ్మెల్యే కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే కి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.