నగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇసుక మాఫియాను అడ్డుకోవాలంటూ బుధవారం మహిళలు, ప్రజలు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నగిరి పరిధిలోని కుశస్థలి నదిలో అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు. ఇసుకను తరలించే ట్రాక్టర్లు వెళ్లే వేగానికి ఎనిమిది గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు మహిళలు తెలిపారు.