ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం నగరి నగిరి నియోజకవర్గం, వడమాల పేట మండలం, తిరుమండ్యం గ్రామపంచాయతీలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిని కరపత్రాలు రూపంలో ప్రజలకు అందజేశారు.