వైసిపి ‘పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ'ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించి పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీలో మాజీ మంత్రి రోజాకు చోటు దక్కింది. ఈ సందర్భంగా నగిరి లో రోజా మాట్లాడుతూ తనపై తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటా నన్నారు. ఈ సందర్భంగా ఆమె జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.