చిత్తూరు జిల్లా నగిరి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నగిరి మున్సిపాలిటీ కి చెందిన పలువురు నాయకులతో మాజీ మంత్రి రోజా బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులతో చర్చించారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని రోజా నాయకులకు తెలిపారు. అనంతరం పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్ గా నియమితులైన రోజాకు శుభాకాంక్షలు తెలిపారు.