నగిరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలోని బెస్తవీధిలో ఉన్నటువంటి తరుణ గణపతి ఆలయంలో శనివారం సంకట హర చతుర్థి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాట్లాడుతూ చవితి చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని భక్తులు నిర్వహించినట్లయితే వారికి ఉన్నటువంటి కష్టాలు తొలగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.