బడి ఈడు పిల్లలు పాఠశాలకు వెళ్లాలని, పనికి వెళ్లకూడదని నగిరి డిఎస్పి మహమ్మద్ అజీజ్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నగిరి పట్టణ పరిధిలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, వెల్డింగ్ షాపులు తదితర ప్రాంతాలలో లేబర్ అధికారితో కలిసి డిఎస్పి తనిఖీలు నిర్వహించారు. బాల కార్మికులను ఎవరైనా సరే పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవన్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంచిపెట్టారు.