నగిరి ఏరియా ఆసుపత్రిలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు అరికట్టాలని టీడీపీ నాయకులు బుధవారం ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మంజులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో మృతి చెందిన వారిని, ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేసిన వారి వద్ద నుంచి అధిక మొత్తంలో అంబులెన్స్ డ్రైవర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు.