కూటమి ప్రభుత్వంలోని పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె నగిరిలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించకపోవడం బాధాకరమన్నారు.