కూటమి పాలనలో తిరుపతి ప్రతిష్ఠ రోజు రోజుకు దిగజారుతున్నట్టు మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం నగిరి పట్టణంలో మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ నాయకులపై దాడికి పాల్పడటం, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుస్తోందన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఇంత రాగ్దంతం ఎందుకు అని ప్రశ్నించారు.