నిండ్ర మండలం కావునూరు గ్రామపంచాయతీలో నిండ్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వినీషా ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి.ఎల్ఏటిఓ డాక్టర్ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. టిబి రహిత సమాజం మన ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.