నిండ్ర: పీహెచ్ సీ ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

78చూసినవారు
నిండ్ర: పీహెచ్ సీ ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
నగిరి నియోజకవర్గం, నిండ్ర పీహెచ్ సీ ని జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్