పుత్తూరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల వారి 554వ జయంతి

62చూసినవారు
పుత్తూరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల వారి 554వ జయంతి
శ్రీకృష్ణదేవరాయల వారి 554వ జయంతి వేడుకలు నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలో బలిజ సంఘం భవనం కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుత్తూరు బలిజ సంఘం అధ్యక్షుడు పసుపులేటి శివయ్య పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి. గోపిరాయల్, జి. కృష్ణయ్య, గోపాల్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్