నగిరి నియోజకవర్గం, పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా ఉన్నత విద్య ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కలిగిన పుస్తకాలను పంపిణీ చేశారు.