నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామికి మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా మకర జ్యోతి పూజ జరిగింది. మకర సంక్రాంతి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం శివ, పార్వతులను పట్టణంలోని కాపువీధి, బజారు విధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.