నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ఆవరణంలో మంగళవారం యాంత్రీకరణ సబ్సిడీ పరికరాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతులు మీదుగా రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని భాను ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు , తదితరులు పాల్గొన్నారు.