మాదకద్రవ్యాల వాడకం ఒక ప్రమాదకరమైన పరిస్థితికి వ్యసనమని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కోటేశ్వరయ్య అన్నారు. బుధవారం పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరాన్ని చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైందన్నారు.