నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలంలోని పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉచిత కంటి అద్దాలను ప్రిన్సిపల్ యస్వీ కుమార్ పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో గత నవంబర్ లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం నిర్వహించి ఫలితాలు ఆధారంగా 28 విద్యార్థులలో కంటి లోపం ఉందని గుర్తించి కంటి అద్దాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.