పుత్తూరు మున్సిపాలిటీ మిట్టపల్లూరుకు చెందిన మాజీ సర్పంచ్ గోవిందస్వామి రెడ్డి మంగళవారం మృతి చెందారు. సమాచారం అందుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ గోవిందస్వామి భౌతిక కాయం సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు.