పుత్తూరు మున్సిపాలిటీ గేట్ సమీపంలో ఉన్న శ్రీ గోవిందమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం జరిగిన పాలాభిషేకం కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అమ్మవారికి స్వయంగా పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.