నగిరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు తిమ్మాపురం శ్రీ కృష్ణ మందిరంలో నూతన కుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంగళవారం మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఆలయ నిర్వహకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ నిర్మాణానికి రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ. 1 లక్ష విరాళం అందజేశారు.