పుత్తూరు: అండర్ బ్రిడ్జి కింద నీటిని తొలగించాలి

69చూసినవారు
నగిరి నియోజకవర్గం, పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగకు వెళ్లే దారిలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద నీటి నిల్వ ఎక్కువగా ఉందని గ్రామస్థులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు వాహనాలు అదుపుతప్పి పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు ఈ దారి గుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. అధికారులు , ప్రజాప్రతినిధులు ఈ విషయంపై స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్