యుక్త వయస్సులో యువత దురలవాట్లకు అక్రమ లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని శుక్రవారం డాక్టర్ షర్మిల తెలిపారు. ఇందులో భాగంగా నగిరి నియోజకవర్గం, పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబరు 1న ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, చర్చా వేదిక, పోస్టర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఒకటవ తేదీ సెలవు దినం కావడంతో ముందుగా ఈ కార్యక్రమాలను చేసామన్నారు.