విజయపురం మండలం శ్రీహరిపురం శ్రీ రామ మందిరం నందు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం సీతారామ కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆలయ ధర్మకర్త రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం, గ్రామంలో సీతారాముల ఉత్సవ మూర్తులను ఊరేగించి, రామ నామ జపంతో భక్తులు పరవశించారు.