నిండ్ర మండలం పాత ఆరూరు గ్రామంలో వెలసిన శ్రీ అంకాలమ్మ ఆలయంలో బుధవారం ఉదయం విశేష పూజలు జరిపారు. ఉదయాన్నే ఆలయ పూజారి దాము స్వామి అమ్మవారికి పాలాభిషేకం చేపట్టారు. అనంతవరం నైవేద్యంగా అంబలి, పొంగళ్ళు సమర్పించారు. తిరుపతిలో జరుగుతున్న గంగమ్మ జాతర పురస్కరించుకొని ప్రతి ఏటా పూజలు జరుపుతారు. అనంతరం మహిళలు కర్పూర హారతులు అందజేశారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.