డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఆ నెల పెన్షన్ ను ఒకరోజు ముందుగా శనివారం రోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తడుకు సర్పంచ్ పి. వెంకటేష్( బొబ్బిలి యాదవ్) తెలిపారు. పుత్తూరు రూరల్ మండలం తడుకు గ్రామపంచాయతీ మజ్జిగగుంట ఎస్టీ కాలనీలో వర్షంలో సైతం లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తులసి, అంగన్వాడీ టీచర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు.