నగరి నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు వడమాలపేటలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గురుమూర్తి పూడి రోడ్డు నుంచి వడమాలపేటకు కానిస్టేబుల్ తొ కలసి ద్విచక్ర వాహనంలో వస్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఏఎస్ఐ తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు 108 ద్వారా అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.