గత ప్రభుత్వంలో నగరి నియోజక వర్గం, విజయపురం మండలం, కోసల నగరం సచివాలయంలో 17 పేద కుటుంబాలకు ఇంటి ఇంటి స్థలాలను మంజూరు చేస్తామని. అప్పటి ఆర్డిఓ, ఎమ్మార్వో చెప్పి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఆ కుటుంబాలను మోసం చేశారని సీపీఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య తెలిపారు. ఈ సందర్భంగా విజయపురం లో గురువారం ఆయన మాట్లాడుతూ సంబంధిత తహసిల్దార్ కు గ్రామంలోని సమస్యను తెలియజేశామన్నారు.