యువత ఆశయాలతో ముందుకు వెళ్లాలి

84చూసినవారు
యువత ఆశయాలతో ముందుకు వెళ్లాలి
యువత నిర్ణీతమైన ఆశయాలను ఏర్పరచుకొని తమలోని శక్తిని గుర్తించి ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. వేణుగోపాల్‌ శుక్రవారం అన్నారు. కళాశాలలో 3వ సంవత్సం విద్యార్థులు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు శ్రమించి విజయాన్ని స్వంతం చేసుకోవాలన్నారు. ఓటమిని గెలుపు పాఠంగా మార్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్