కార్డెన్ సెర్చ్ లో అక్రమ మద్యం పట్టివేత

56చూసినవారు
కార్డెన్ సెర్చ్ లో అక్రమ మద్యం పట్టివేత
ఉలవపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో ఎస్ఐ బాజిరెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గ్రామంలో నక్క చిన్న నరసింహులు అనే వ్యక్తి ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉన్న 17 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని ప్రజలకి సూచించారు.

సంబంధిత పోస్ట్