పలమనేరు మున్సిపల్ పరిధిలోని గంటావూరు గ్రామంలో జీవన్, ప్రకాశ్ కుటుంబ సమస్యలపై గొడవ పడ్డారు. ఇద్దరి నడుమ అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు మధ్యవర్తిత్వం చేస్తుంటే ప్రకాశ్, భూపతి వర్గం దాడి చేసినట్లు బాధితుడు శ్రీనివాసులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.