పలమనేరు బైపాస్ రోడ్డులో కీలపట్ల మలుపు వద్ద గొయ్యి ప్రమాదకరంగా ఉంది. రోడ్డు సైడు ఏర్పాటు చేసిన డ్రైనేజీ కాలువ దెబ్బతినడంతో గొయ్యి ఏర్పడింది. దానిపై రాళ్లను కప్పిపెట్టారు. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆదివారం కోరారు.